సాక్షి, చెన్నై: నిత్యానంద దేశానికి తమిళనటి ప్రధానమంత్రి కానుంది అనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ఇప్పుడు కలకలం సృష్టిస్తున్న పేరు నిత్యానంద. ఇప్పుడే కాదు చాలా కాలం నుంచే ఈ పేరు వివాదాల్లో ఉంది. అయితే మధ్యలో కాస్త మరుగున పడింది. తాజాగా పిల్లల కిడ్నాప్ కేసులో పోలీసులకు వాంటెడ్ వ్యక్తిగా మారాడు. ఆధ్యాత్మక గురువుగా, బోధకుడిగా చెలామణీ అయిన నిత్యానంద పలు చోట్ల ఆశ్రమాలను నడుపుతూ పలువురు భక్తులను ఆకర్షించాడు. ముఖ్యంగా విదేశీయులను వశపరచుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. అలా కోట్లాది రూపాయలను కూడబెట్టాడు. అయితే అంతేలా లైంగిక, అత్యాచార ఆరోపణల్లోనూ వాసికెక్కాడు. కొంత కాలం జైలు జీవితాన్ని గడిపిన నిత్యానంద ఇప్పుడు పరారీలో ఉన్నాడు. కాగా ఈయనకు ప్రధాన శిష్యురాలుగా ఒక తమిళ నటి చేరి చాలా కాలమైంది. నిజానికి ఆమె తెలుగు అమ్మాయినే, తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది, నిత్యానందతో ఈమె సంబంధాల గురించి ఆ మధ్య చాలా రచ్చ జరిగింది. అయితే ఈ మూడక్షరాల నటి నిత్యానంద సేవలోనే తరుస్తూ వస్తోంది. అందుకు ఫలం ఇప్పుడు లభించనుందనే ప్రచారం జోరందుకుంది.
నిత్యానంద దేశానికి ప్రధానిగా తమిళనటి?