పోలీసుల వేట.. పరారీలో నిత్యానంద!

పరారీలో నిత్యానంద! | బెంగళూరు: బెంగళూరులోని బిడది ధ్యాన పీఠాధిపతి వివదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లైంగిక వేధింపులు తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఏడాదిన్నరగా బిడది ధ్యాన పీఠానికి రావడం లేదు. నిత్యానంద కోసం ధ్యానపీఠంలో వాకబు చేయగా ఆయన ఉత్తర భారత పర్యటనలో ఉ న్నట్లు చెబుతున్నారు. గుజరాత్ లోనూ నిత్యానందకు మఠం ఉండడంతో అక్కడకి వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నారు. నకిలీ పాస్పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలొచ్చాయి. కాగా అహ్మదాబాద్ లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తన ఇరువురు కుమార్తెలను విడిపించాలని ఓ తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఇరువురిని విముక్తి కల్పించిన పోలీసులు నిత్యానందతో పాటు అహ్మదాబాద్కు చెందిన ఇరువురు ఆశ్రమ ముఖ్యులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు